జర్మనీకి చెందిన ట్రూక్ కంపెనీ ట్రూక్ ప్రో పేరుతో అతి తక్కువ ధరలో బ్లూటూత్ ఇయర్ బడ్స్‌ను ప్రవేశపెట్టింది.
వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లను కొనాలనుకున్నవారు అమెజాన్‌లో ఇప్పుడు రూ. 1,000కు సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న షియోమి, బోట్, రియల్‌మీ బ్రాండ్స్‌కు చెందిన ఇయర్ బడ్స్ ధరలు రూ.2000కు పైగా ఉన్నాయి. ట్రూక్ ఫిట్ ప్రోలో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. వీటిలో యుఎస్బి టైప్-సి ఛార్జింగ్, బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ సౌకర్యం ఉంది. అలాగే ఇయర్ ఫోన్స్ మరియు ఛార్జింగ్ కేసు మధ్య 24 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. . పోర్టబుల్ ఛార్జర్‌తో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను సుమారు 90 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.
ఇయర్‌ఫోన్‌లు 15 నిమిషాల ఛార్జింగ్ తర్వాత ఒక గంట ప్లేబ్యాక్ టైం ఉంటుంది. ఛార్జింగ్ కేసు 500 ఎమ్ఏహెచ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఇయర్ ఫోన్స్ 13 ఎంఎం డైనమిక్ డ్రైవర్లతో పనిచేయడం విశేషం.ఈ ట్రూక్ ఫిట్ ప్రోలో వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉండడం మరో ప్రత్యేకత. ఇది ఆండ్రాయిడ్ iOS పరికరాలతో పనిచేస్తుంది. అయితే ప్లాస్టిక్ తో కూడిన ఇయర్ బడ్స్ చార్జింగ్ కేస్ బిల్ట్‌క్వాలిటీ సాదాసీదాగా ఉంటుంది.
ట్రూక్ ఫిట్ ట్రూ వైర్‌లెస్ హెడ్‌సెట్‌లోని మల్టీ ఫంక్షన్ బటన్ (MFB) సాయంతో ఏదైనా Android, లేదా ఐవోఎస్డివైజ్‌లతో కనెక్ట్ చేయవచ్చు. ఎడమ ఇయర్‌బడ్‌లో బటన్ రెండుసార్లు నొక్కితే GOOGLE, SIRI వాయిస్అసిస్టెంట్ఆన్ అవుతుంది.ఇది స్వెట్ ప్రూఫ్ అయినందు వల్ల చెమటతో తడిసినా ప్రమాదమేమీ ఉండదు.ఇది ఒక సంవత్సరం వారంటీతో amazon.inలో రూ.999కి లభ్యమవుతోంది.
ముఖ్యమైన ఫంక్షన్లు
- 5 సెకన్ల పాటు లాంగ్ ప్రెస్ చేస్తే: పవర్ ఆన్ / ఆఫ్
- ఏదైనా ఇయర్‌బడ్‌ను సింగిల్ ప్రెస్ చేస్తే ప్లే / పాజ్ అవుతుంది.
- కుడి ఇయర్‌బడ్ - 2Sec లాంగ్ ప్రెస్ చేస్తే తదుపరి ట్రాక్ కు వెళ్తుంది.
- ఎడమ ఇయర్‌బడ్ - 2Sec లాంగ్ ప్రెస్ చేస్తే అంతకుముందు ట్రాక్ సెలక్ట్ అవుతుంది.
- కుడి ఇయర్‌బడ్ - డబుల్ ప్రెస్ చేస్తే కాల్ రీడియల్ అవుతుంది.
- లెఫ్ట్ ఇయర్బడ్ - డబుల్ ప్రెస్ చేసి అసిస్టెంట్ / సిరి ఆన్ చేయొచ్చు.
- కాల్ ఆక్సెప్ట్ / కాల్ ఎండ్ చేయడానికి ఏదైనా ఇయర్బడ్ ను సింగిల్ ప్రెస్ చేయాలి.
- కాల్ రిజెక్ట్ చేయడానికి ఏదైనా ఇయర్‌బడ్‌ను 2 సెకన్ల పాటు ప్రెస్ చేయాలి.
- ----------------------------------------------------------------------
ట్రూక్ ఫిట్ ప్రో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
0 Comments