అద్భుత ఫీచర్‌తో లావా బడ్జెట్ ఫోన్
దేశీయ కంపెనీ లావా అద్భుతమైన ఫీచర్‌తో లావా పల్స్ పేరుతో బడ్జెట్ ఫోన్ ప్రవేశపెట్టింది. ఫిట్‌నెస్ బ్యాండ్‌లోమాదిరిగా ఈ ఫోన్‌లో హార్ట్‌బీట్( హృదయ స్పందన రేటు)తోపాటు బీపీ(రక్తపోటు) మానిటరింగ్ చేసే ఆకర్షణీయమైన ఫీచర్ ఇందులో ఉంది. ఒక ఫీచర్ ఫోన్‌లో ఇలాంటి సౌకర్యాన్ని పొందుపరచడం ఇదే తొలిసారి. లావా పల్స్ ఫోన్ వెనుక భాగంలో ఉన్న సెన్సార్‌పై వేలిని ఉంచడం ద్వారా వారి హృదయ స్పందన రేటు, రక్తపోటును కొలిచి ఆ వివరాలను స్క్రీన్‌పై ప్రదర్శిస్తుంది. ఈ ఫోన్ 1,800 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ఆరు రోజుల బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది.
ఇండియాతో ఈ లావా పల్స్ ఫోన్ ధర రూ. 1,949. ఈ ఫోన్ ఆన్‌లైన్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లలో అందుబాటులో ఉంది. అలాగే ఆఫ్‌లైన్‌లోనూ లక్షకుపైగా రిటైల్ స్టోర్లలో లభిస్తుంది.
లావా పల్స్ స్పెసిఫికేషన్లు
లావా పల్స్ 2.4-అంగుళాల (240x320 పిక్సెల్స్) QVGA డిస్‌ప్లేను కలిగి ఉంది రెండు సిమ్‌లను వినియోగించుకోవచ్చు. 32MB ర్యామ్, మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా ఇంటర్నల్ మెమోరీని 32జీబీ వరకు పెంచుకోవచ్చు. ఈ ఫీచర్ ఫోన్లో 100 SMSలను 500 ఫోన్ బుక్ కాంటాక్టులను సేవ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్, హిందీ, తమిళం, కన్నడ, తెలుగు, గుజరాతీ, పంజాబీలతో సహా ఏడు భాషలలో టైప్ చేసుకోవచ్చు. ఇక కనెక్టివిటీ విషయానికొస్తే మైక్రో- USB, 3.5mm ఆడియో జాక్, వైర్‌లెస్ FM రేడియో వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఆటో కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా ఇందులో పొందుపరిచారు.
హార్ట్ బీట్, బీపీ మానిటర్
ఈ ఫోన్‌లో అన్నింటికంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది హార్ట్ బీట్ రేటు, బీపీ మానిటర్. వినియోగదారులు వారి వేలిని ఫోన్ వెనుక భాగంలో టాప్ చేస్తే.. బీపీ, హార్ట్‌బీట్ రేట్ ఫోన్ స్క్రీన్‌పై తెరపై గణాకంకాలు ప్రదర్శించబడతాయి. ఈ వివరాలను తరువాత వైద్యులకు చూపించడానికి వినియోగదారు సేవ్ చేయవచ్చు.
0 Comments